Election Updates: పెన్షన్ పెంపుపై కీలక ప్రకటన చేసిన సీఎం జగన్‌

Election Updates: CM Jagan made a key announcement on pension hike
Election Updates: CM Jagan made a key announcement on pension hike

పెన్షన్ పెంపుపై సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. కుల, మత, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నామన్నారు సీఎం జగన్. వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేది మీకు గుర్తుందా అని ప్రశ్నించారు.

గతంలో ఎన్నికలకు ముందు రూ.1000 పెన్షన్ ఇచ్చేవారని… ఇప్పుడు మీ బిడ్డ 3000 వేలు ఇస్తున్నాడని చెప్పారు. గతంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే.. ఇప్పుడు 66 లక్ష మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు సీఎం జగన్‌. దేశంలో ఎక్కడ ఇంటికీ ఇచ్చే పెన్షన్ లేదని పేర్కొన్నారు సీఎం జగన్. ఏటా 24 వేల కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం..పెన్షన్ ఇవ్వటంలో మనతో పోటీ పడే రాష్ట్రాలు లేవన్నారు. రేపు పెన్షన్లు నాలుగు వేలు చేస్తాం, ఐదు వేలు చేస్తాం అని కూటమి నేతలు చెబుతారు..నేను చెప్పనివి కూడా చాలా చేశానని గుర్తు చేశారు సీఎం జగన్‌.