నేడు పులివెందుల, ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.1000 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. సీఎం పర్యటన వివరాలు ఇలా…ఉన్నాయి. ఇవాళ ఉదయం 10.20 కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. -అక్కడి నుంచి 10.25కు హెలికాప్టర్లో బయలు దేరి 10.40 పులి వెందులలోని భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
10.45కు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి 10.55కు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు చేరుకుంటారు. 11.35 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.35 రోడ్డు మార్గాన బయలు దేరి 11.45కు బనాన ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.10 డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటారు. 12.25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. 2.15కు హెలిక్టాపర్లో బయలుదేరి 2.25కు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 2.30కి రోడ్డు మార్గాన బయలుదేరి 2.35కు వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ వద్దకు చేరుకుంటారు. 2.55 వరకు పార్క్ ప్రారంభోత్సవంలో గడుపుతారు. 5.30 అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.50కి సీఎం అధికార నివాసానికి చేరుకుంటారు.