Election Updates: డబ్బు సంచులతో దొరికిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ?

Election Updates: Congress candidate found with money bags?
Election Updates: Congress candidate found with money bags?

డబ్బు సంచులతో దొరికిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్. మరోసారి డబ్బు సంచులు తరలిస్తూ సాక్షాలతో సహా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ సంస్థలకు చెందిన ఉద్యోగులు పట్టుబడ్డారు. వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలోని లీడర్లను కొనుగోలు చేయడానికి 50 లక్షలు తరలిస్తూ పట్టుబడ్డారు.

పట్టుబడిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న వెలుగు పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్ ఉన్నారు. పట్టుబడిన మొత్తాన్ని చెన్నూరు నియోజకవర్గానికి తరలిస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో FIR నమోదు చేయడం జరిగినది. పట్టుబడిన వారి నుండి 50 లక్షల రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిన్న బాల్క సుమన్‌ ఎలక్షన్ అధికారులకు వివేక్‌ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.