రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు ప్రభుత్వం మారనున్నఈ తరుణంలో ఆపద్దర్మ ప్రభుత్వం ఇష్టారాజ్యoగా వ్యవహరించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కార్యకలాపాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఆర్థిక, విధానపర నిర్ణయాలపై నజర్ పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
సర్వే సంస్థలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడంతో ప్రస్తుత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ…ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుడుగా నమోదు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని.. రైతులకు రైతుబంధు పథకాన్ని నిలిపివేసిన పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి నిధులను పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు దారి మల్లించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు.