పింఛన్ల పంపిణీపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు సూచించారు. వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ ఇబ్బంది లేదని, నగరాలు, పట్టణాల్లో కొంచెం కష్టతరమవుతుందని చెప్పారు. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేస్తే.. సౌకర్యా లు కల్పించాలని కొందరు కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎస్ ఈ రాత్రికి పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తామన్నారు.