ఏపీ రాష్ట్ర మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే… ఇవాళ కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు సీఎం జగన్. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే… 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయనుంది. ఈ పథకం కింద మూడేళ్ల పాటు 45 వేల రూపాయల ఆర్థిక చేయూత అందించనుంది ఏపీ సర్కార్.