మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులకు సరైన సమయంలో సహాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు నష్టపోకూడదనే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఏ పంట నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా పరిహారం అందజేస్తున్నాం.
చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 30లక్షల 85వేల మందికి మాత్రమే 3,415 కోట్లు ఇచ్చే సరికి కొన్ని వర్గాలు బాదపడుతున్నాయి. గతంలో రంగు మారిన ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండేది కాదన్నారు. 7,812 కోట్లు నిధులు జమ చేశామని తెలిపారు. 54 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 58 నెలల కాలంలో మార్పు జరిగింది. రూ.13500 పెట్టుబడి సహాయం అందజేస్తున్నాం. రైతులకు 80 శాతం పెట్టుబడి సహాయం అందజేస్తున్నాం. ఏపీలో అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. 6,96వేల మంది రైతన్నలకు కరువుకి సంబంధించిన నష్టానికి 842 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 4,61వేల మంది 442 కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 1300 కోట్ల రూపాయలు ఇన్ పుట్ సబ్జీడీ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు.