జొన్న రైతులకు జగన్ శుభవార్త చెప్పారు. మద్దతు ధరకు కొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని జొన్న రైతులకు జగన్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. మద్దతు ధర కంటే జొన్నల మార్కెట్ ధర తగ్గిపోయింది. దీంతో రైతులను ఆదుకొనేందుకు రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం.
హైబ్రిడ్ రకం జొన్నలు మద్దతు ధరకు కొనాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్. దీంతో 27,722 టన్నుల జొన్నల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. ఇక జొన్నలు క్వింటాల్ రూ.3,180 చొప్పున కొనుగోలు చేయనుంది జగన్ సర్కార్. ఇవాల్టి నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి.