అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జీతాల పెంపు సహా పలు డిమాండ్లతో డిసెంబర్ 12 నుంచి జనవరి 22 వరకు (42 రోజులు) చేసిన సమ్మె కాలానికి జీతం చెల్లింపునకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, సమ్మె కాలాన్ని చెల్లించే జీతంలో కోత విధిస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు అంగన్వాడీలు సమ్మె చేసిన విషయం తెలిసిందే. మొత్తం 42 రోజులపాటు అంగన్వాడీలు సమ్మెను చేశారు. వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మెలోకి దిగారు.