రాజమహేంద్రవరం నగర వైకాపా అభ్యర్థి, ఎంపీ భరత్‌రామ్ పేరిట కొన్ని రోజులుగా మహిళలకు డివిజన్ల వారీగా చీరలు పంపిణీ చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ ప్రస్తుతం డివిజన్లలో ప్రచారం మొదలుపెట్టిన ఎంపీ.. తాను ఇచ్చిన తాయిలాలపై ఓటర్లను ఆరాతీస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఓ ఓటరును.. ఇంటికి చీర వచ్చిందా? లేదా? అంటూ ఎంపీ ప్రశ్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై ఆర్వోకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.