“మగాడివైతే గాజువాకలో గెలిచి రా, ఇక్కడ ఇంకొకడి సీటు లాక్కోవడం కాదు” అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దింతో పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య వివాదం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నానని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎప్పటి నుండో కొనసాగుతున్న సస్పెన్స్ కి బ్రేక్ పడింది పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని తెలిపారు.
పొత్తులో భాగంగా పిఠాపురం పవన్ కళ్యాణ్‌కు కేటాయించడంతో చంద్రబాబు, లోకేష్‌ను టీడీపీ అభ్యర్థి వర్మ అభిమానులు తిడుతున్నారు. అటు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై ఆగ్రహంలో రెచ్చిపోయారు వర్మ అనుచరులు. టీడీపీ ఫ్లెక్సీలు జెండాలు వర్మ అనుచరులు తగలబెట్టారు. పిఠాపురం నుంచి వర్మ పేరు ప్రకటించాలని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. లేదా ఇండిపెండెంట్‌గా వర్మ పోటీకి దిగాలని అనుచరులు ఆందోళనకు దిగారు.