సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. VRAల నుంచి VROలుగా పదోన్నతి పొంది సర్వే పరీక్ష పాస్ కానీ 600 మంది విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వీఆర్వో అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఏడాదిలోగా సర్వే పరీక్ష పాస్ కావాలని నిబంధనతో వారికి ప్రొఫెషన్ ను జగన్ సర్కార్ ప్రకటించింది. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు.
కాగా అటు వాలంటీర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఎన్నికలతో ముడిపడిన ఏ ప్రక్రియలోనూ వారిని పాల్గొననివ్వవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండేందుకు వారు అనర్హులని తెలిపింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.