ఇవాళ టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరుగనుంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం ఉంటుంది.ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తు ఉండనుంది. మూడు పార్టీల అగ్ర నేతల భేటీలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.ఇప్పటికే షెకావత్ – పవన్ మధ్య భేటీ జరిగింది.
మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన – బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చ జరుగనుంది. పాడేరు, విశాఖ నార్త్, పి. గన్నవరం, కదిరి, మదనపల్లె, కాళహస్తి, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనే ప్రతిపాదనను బీజేపీ పెట్టినట్టు సమాచారం అందుతోంది. ప్రతిపాదిత స్థానాల్లో నుంచి 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ – జనసేన వచ్చాయట. చంద్రబాబుతో భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు షెకావత్, పవన్. ఇవాళ లేదా రేపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది