వాలంటీర్లపై అచ్చెన్న కీలక ప్రకటన చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న అచ్చెన్న….అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. టీడీపీ దానికే కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకైన వాలంటీర్ల పైనే సుధీర్ వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు.
వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్ధించదని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని చెప్పారు. జగన్ రెడ్డికి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదు. వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కోరుతున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.