ప్రకాశం జిల్లా మేదరిమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 10న ఆదివారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామ పరిధిలో జరిగిన సిద్ధం సభలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ముగిసిన అనంతరం ఒంగోలు కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసే ఊదర గుడి మురళీకృష్ణ అనే వ్యక్తి గుండె పోటుతో మరణించాడు.
సిద్ధం మీటింగ్ లో ఏర్పాటు చేసిన ఓ గ్యాలరీ నుంచి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో వెంటనే అతడిని 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలిస్తూ వుండగా మార్గం మధ్యలో గుండె పోటుతో మరణించాడు. అయితే…ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ మృతి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ఏకంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారు.