గుడ్ న్యూస్ : “సలార్ 2” పై తాజా అప్డేట్.!

good-news-latest-update-on-salaar-2
good-news-latest-update-on-salaar-2

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ హిట్ మూవీ “సలార్ సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ హిట్ తో మేకర్స్ పార్ట్ 2 “సలార్ శౌర్యంగ పర్వం” కూడా ఖచ్చితంగా ఉందని తెలిపారు. మరి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మొదట్లో మూవీ లేట్ గా స్టార్ట్ అవ్వొచ్చు అని టాక్ వచ్చింది కానీ తర్వాత మాత్రం పరిస్థితులు మారడంతో వెంటనే షూటింగ్ ఉంటుంది అని తెలిసింది.

good-news-latest-update-on-salaar-2
good-news-latest-update-on-salaar-2

మరి దీనిపై లేటెస్ట్ గా మళయాళ స్టార్ నటుడు తన గోట్ లైఫ్ ప్రమోషన్స్ లో సలార్ 2 షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అని కన్ఫర్మ్ చేసాడంట . ప్రభాస్ నేను ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యామని సలార్ 2 చాలా చాలా తొందరలోనే స్టార్ట్ అవుతుంది అని షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసాడు. దీనితో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న కొన్ని మూవీ లు ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసో లేక వాటితోనే స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి. మరి ఈ భారీ మూవీ కి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.