నన్ను, సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయన్నారు. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
పగిలే కొద్ది గ్లాస్ పదును ఎక్కుతుందని… కిరాయి మూకలు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీని నన్ను కట్ చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అందరూ ప్రోటోకాల్ పాటించాలని, ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు అందరూ తెలుసుకోవాలని తెలిపారు. పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటాను… నేను దేవుడిని నా గురించి ఎప్పుడూ ఏమీ అడగలేదని వెల్లడించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.