ఉండవల్లిలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గృహంలో బిజెపి, జనసేన నేతలు సోమవారం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేక్వత్ బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా శివ ప్రకాష్ అలానే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చంద్రబాబు ఇంటికి చేరుకుని చర్చలు ప్రారంభించారు.
మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఈ సమావేశం కీలక మారింది బిజెపికి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు జనసేనకి 24 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలకు పోటీ చేసే విధంగా టిడిపి తో పొత్తు కుదిరింది. ఈ సమావేశంలో ఏ ఏ సీట్ల లో ఎవరు పోటీ చేయాలి అభ్యర్థులు ఎవరు అనే దాని గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మూడు పార్టీలకి సంబంధించిన అభ్యర్థుల జాబితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.