రైతు రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ త్వరలోనే పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ కోసం రూ. 20 వేల కోట్లు అవసరం కాగా…. రూ. 13,300 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని, త్వరలోనే మిగతా రూ. 6700 కోట్లు మాఫీ అవుతాయని సిరిసిల్లలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో వాక్యానించారు.
అటు బిఆర్ఎస్ మెనీఫెస్టోలో కెసిఆర్ బీమా పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఇవాళ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు లక్ష మంది హాజరుకానున్న సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది . సిరిసిల్ల పట్టణంలోని సభా స్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించి, పార్టీ నేతలకు పలు సలహాలు, సూచనలు కేటీఆర్ చేశారు.