ప్రశాంత్ కిషోర్ మరో లగడపాటి కావడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓటమి కాదు.. భారీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. అయితే…ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.
లగడపాటిని ముంచినట్టు పీకే నెత్తిన చంద్రబాబు చెయ్యి పెట్టాడంటూ సెటైర్లు పేల్చారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడినదంతా చంద్రబాబు మాటలేనని.. ప్రశాంత్ కిషోర్ మరో లగడపాటి కావడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీయేనన్నారు మంత్రి అంబటి రాంబాబు.