వివేకానం దరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్.. కడప ఎం పీ టికెట్ ఇచ్చా రని ఏపీసీసీ అధ్య క్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకొని తిరుగుతున్నారు. వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. దారుణంగా చిన్నాన్నను చంపితే.. గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో చూపించారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాష్ కు.. జగన్ టికెట్ ఇచ్చారు. నేను ఎంపీగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక. అందుకే ఆయనపై కక్షగట్టి హతమార్చారు. సునీత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేకుండా, ఆమెపైనే ఆరోపణలు చేస్తున్నారు. YSR బిడ్డగా ఏం చేయాలో ఆలోచించాను. హత్యా రాజకీయాలకు మేం వ్యతిరేకం. వైకాపా.. నిందితులకు టికెట్ ఇచ్చింది. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా’’ అని తెలిపారు.