అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం బుద్దప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ నాయకులతో చర్చిస్తున్నారు.
రైల్వేకోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షమైన టిడిపి వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మరింత లోతుగా అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రైల్వేకోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశారు.