Election Updates: ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ అమలు సబబే: చంద్రబాబు

Election Updates: Chandrababu will campaign for election from 26th of this month
Election Updates: Chandrababu will campaign for election from 26th of this month

త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయినాయి. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమర్థించారు.

దాని అమలులో ఎటువంటి తప్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఏ దేశానికైనా దాని సొంత పౌరసత్వ చట్టం ఉంటుంది. అందులో తప్పేముంది’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.కాగా.. CAAలో సవరణలు మత ప్రాతిపదికన జరిగాయని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేశారు. బోర్డు ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి పి సీతారామాంజనేయుల్ని సస్పెండ్ చేయాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు.