తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పావులు కదుపుతోంది. అందుకోసం కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలను కాంగ్రెస్ అధిష్టానం అమలు చేయాలని భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం కర్ణాటక నుంచి 58 మంది సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. 48 నియోజకవర్గాలలో గెలుపు కోసం వీరందరూ ఇక్కడి నేతలతో కలిసి పని చేస్తారని కాంగ్రెస్ అది నాయకత్వం చెబుతోంది.
కాంగ్రెస్ ఇప్పటివరకు 119 నియోజకవర్గాలలో 48 స్థానాలలో అసలు గెలుపు అన్నదే తెలియలేదు. అటువంటి చోట్ల ఈసారి కాంగ్రెస్ తన జెండా పాతాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. 48 స్థానాలలో హైదరాబాద్ లోని ఏడు నియోజకవర్గాలలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆ ఏడు నియోజకవర్గాలు తప్ప మిగిలిన 41 నియోజకవర్గాలలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరాలని ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారంటీల హామీలతో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఇప్పుడు తెలంగాణలో ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి, బస్సులో ఉచిత రవాణా వంటి ఆరు గ్యారెంటీ స్కీములతో ఈసారి విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో విజయాన్ని కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే 2సార్లు వరుస ఓటమిలతో ఉన్న కాంగ్రెస్ ఈసారి కచ్చితంగా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. అందుకోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తోంది.
మరి తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ వైపు చూస్తారా……?