కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు ఎంతో ఉత్కంఠగా మారింది. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపారు. కానీ అంతలోనే ఢిల్లీలో ఫైనల్ చేయాలని డీ.కే.శివకుమార్, అప్జర్వర్లను ఢిల్లీకి పిలిపించారు మల్లికార్జున ఖర్గే. అదేవిధంగా ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వెళ్లారు.
ఇవాళ ఉదయం డీ.కే.శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. థాక్రెతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పలు విషయాలను చర్చించారు. అయితే ఖర్గే నివాసంలో సమావేశం జరిగింది. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసీ వేణుగోపాల్ కూడా ఖర్గే నివాసం నుంచి వెళ్లిపోయారు. మరోవైపు డీకే శివకుమార్, థాక్రె సమావేశమయ్యారు. దాదాపు సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఖరారు అయినట్టు సమాచారం. డీ.కే.శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి బయలుదేరారు. హైదరాబాద్ కి ప్రత్యేక ప్లైట్ ద్వారా చేరుకొని సాయంత్రం 4 గంటలకు ప్రకటించే అవకాశముంది.