ప్రతిపక్ష నేతల ఫోన్లను వైకాపా ప్రభుత్వం ట్రాప్ చేస్తోందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెదేపాతోపాటు జనసేన, భాజపా నేతల ఫోన్లనూ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. నేతల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ వారి స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి సహా అనేక మంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన ఉన్న తాధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం అండ చూసుకునే అధికారులు ఈ పనులు చేస్తున్నారన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తర్వాత జగన్‌కు భయం పట్టుకుందన్నారు. వైకాపా పాలనలో రూ.7లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.