వైకాపా ఇచ్చిన కానుకలు తమకొద్దంటూ.. వెనక్కు తిప్పిపంపిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. చంద్రగిరి మండలం కల్రోడ్డుపల్లి గ్రామంలోని భజన మందిరానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క ర్‌రెడ్డి పీఆర్వో ప్రకాష్, గ్రామ వాలంటీరు మైక్‌సెట్ తెచ్చి ఇచ్చారు. అయితే స్థానికులు.. తమ దేవాలయానికి మైక్‌సెట్ అవసరం లేదని చెప్పి వాటిని తిరిగి పంపించేశారు.
అంతకుముందు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తరఫున ఆయన తల్లి చెవిరెడ్డి లక్ష్మి, పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడటమే లక్ష్యంగా మైక్సెట్లను అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.