ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమికి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలపడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ’టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి జయప్రకాశ్ నారాయణ సపోర్ట్ చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అని తెలిపారు. రాష్ట్రంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు, ప్రతి సంస్థ ముందుకు రావాలి’ అని ఎక్స్(ట్విట్టర్) లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
కాగా,’సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉండాలి అని జయప్రకాశ్ నారాయణ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు. ఆర్థిక భవిష్యత్తును కాపాడేవారు ఎవరని ప్రజలు ఆలోచించాలి అని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా? ప్రజలను ఓటు వేయనిస్తారా? అనే అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుల జీవితాలు మారాలంటే నిర్భయంగా ఓటేయాలని జేపీ నారాయణ పిలుపునిచ్చారు.