మరికొన్ని రోజులలో దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంట్ స్థానానికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి తొలి జాబితాను పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు.
వైసీపీ అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు వైఎస్ జగన్ కేటాయించారు. 84 ఎమ్మెల్యే సీట్లు, 16 పార్లమెంట్ స్థానాలను ఈ వర్గాలకు కేటాయించారు. ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. కాగా, 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే, ఈసారి 4 సీట్లు ఎక్కువగా కేటాయించారు. బీసీలకు 2019లో 41 సీట్లు కేటాయిస్తే, ఈసారి 48 సీట్లు ఇచ్చారు.