పల్నాడు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మ క ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో జనసేన నాయకులపై దాడి జరిగింది. మాచర్ల నుంచి స్వ గ్రామం మించాలపాడుకు వెళ్తున్న వారి వాహనాన్ని జంగమహేశ్వరపాడుకు చెందిన వైకాపా నేతలు వెంబడించి రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో జనసేన నాయకులు పసుపులేటి ప్రసాద్, సింగంసెట్టి మధు, దాసరి చెన్నయ్య, పసుపులేటి హనుమంతరావుకు గాయాలయ్యాయి. పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై గురువారం ఎస్పీని ఈసీ వివరణ కోరింది. ఆ మరుసటిరోజే మళ్లీ వైకాపా నాయకులు దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.