నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. ఆర్మూరులో రేవంత్ రెడ్డి సహకారంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన వ్యవహరం వివాదం గా మారిపోయింది. రేఖా నాయక్ కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు రేవంత్ రెడ్డి.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పైన చేయి వేసి.. రేవంత్ రెడ్డి కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియో చూసిన జనాలు రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పట్ల అసభ్యకరంగా రేవంత్ రెడ్డి ప్రవర్తించాడని ఆగ్రహిస్తున్నారు.
కాగా, ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా రేఖానాయక్ ను కాదని ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ ను భూక్యా జాన్సన్ నాయక్ కు కేటాయించింది అధిష్టానం. ఈ క్రమంలో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఆమెకు టికెట్ ఇస్తుందో లేదో చూడాలి.