Election Updates: కాంగ్రెస్ లోకి నవంబర్ 1వ తేదీన చేరనున్న వివేక్ వెంకటస్వామి.!

Election Updates: Vivek Venkataswamy will join the Congress on November 1.
Election Updates: Vivek Venkataswamy will join the Congress on November 1.

కాంగ్రెస్ లోకి చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. రాహుల్ గాంధీ తెలంగాణలో నవంబర్ 1, 2 తేదీలలో ఎన్నికల ప్రచారం జరుగనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారట. ఇక చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి వివేక్ వెంకటస్వామి సిద్ధం అయ్యారట.

కాంగ్రెస్ లోకి వివేక్ వెంకటస్వామి చేరాలని నిర్ణయం తీసుకోవడంతో చెన్నూర్ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అయిందని సమాచారం. దీంతో చెన్నూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా వివేక్ వెంకటస్వామి పేరు ఖరారు అయినట్లేనని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి చెన్నూర్ స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. వివేక్ వెంకటస్వామి కోసం చెన్నూర్ స్థానాన్ని సిపిఐ కు ఇవ్వరాదని తాజాగా నిర్ణయం తీసుకుందట కాంగ్రెస్‌. అధికార బిఆర్ఎస్ ను ఓడించగల సత్తా, సామర్ధ్యం బిజేపికి లేదనే భావనతో వివేక్ వెంకటస్వామి…కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారట.