మార్చ్ మొదటి వారంలోనే షెడ్యూల్…ఇంకా ముందే…!

Elections Schedule Could Be Announced In March First Week

మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన రాబోతోందని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మీడియా సంస్థలకు ఓ లీక్ అందింది. ఆరేడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అసెంబ్లీల కాలపరిమితి ముగియబోతున్న నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో బాటే నిర్వహిస్తామని ఈసీ వర్గాలు విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఏమీ లేదు. గత రెండు, మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలో విడుదలయింది. కచ్చితంగా అలా విడుదల చేస్తేనే.. దేశవ్యాప్తంగా.. సరిగ్గా సమయానికి ఎన్నికలు నిర్వహణ సాధ్యమవుతుంది. అయితే ఈ విషయం ఎందుకు లీక్ ఇవ్వాల్సి వచ్చిందా అని ఆలోచిస్తే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉండేలా విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చేలా ఎన్నికల ప్రకటన కొంత మందుగానేవిడుదల చేయవచ్చన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలవమని భావిస్తున్న బీజేపీ రైతుల కోసం, మధ్యతరగతి జనం కోసం ప్రత్యేక తాయిలాలు రెడీ చేస్తోంది. వాటిని ప్రకటించగానే ఎన్నికల షెడ్యూల్ వెంటనే విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణాలో రైతు బంధు లాగా దేశం మొత్తం రైతులకు పెట్టుబడి సాయం ప్రకటన చేస్తారని చెబుతున్నారు. విపక్ష పార్టీలు ఇంకా ఏకం కాలేదు. బీజేపీని వ్యతిరేకించే విషయంలో ఏక తాటిపైన ఉన్నా కాంగ్రెస్ నాయకత్వంలో పని చేయడానికి అందరూ సిద్ధంగా లేరు. ఈ కలయిక జరగక ముందే విపక్షాలు ఉండగానే పని చక్కబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా రావొచ్చనడానికి ఈసీ తీసుకున్న కొన్ని అనూహ్య నిర్ణయాలే కారణం. ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల అధికారుల్ని మార్చేయడం భారీగా ఎవినీతి ఆరోపణలు ఉన్నప్పటి ఏపీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాంతాలకు అధికారులని నియమించడం లాంటవి చూస్తే ఈసీ ఓ ప్లాన్ ప్రకారమే చేస్తోందన్న అభిప్రాయం వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన రావొచ్చని విపక్ష పార్టీలను మార్చ్ మొదటి వారం అని టైం చెప్పి ఈలోపే ఎప్పుడైనా ఈ ప్రకటన చేయించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.