భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అన్నారు. వచ్చే మూడేళ్లు విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.




