Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముంబై క్రైం బ్రాంచ్ లో దయా నాయక్ తరహాలో.. మరో అధికారి కూడా ముంబై మాఫియాకు వణుకు పుట్టించాడు. అతడే ప్రదీప్ శర్మ. ఈయన పాతికేళ్ల కెరీర్లో సెంచరీ ఎన్ కౌంటర్లున్నాయి. మొత్తం 113 మంది గ్యాంగ్ స్టర్లను మట్టుబెట్టారు. ఈయన కెరీర్ తొలినాళ్లలోనే దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ గ్యాంగ్ ను టార్గెట్ చేయడంతో.. డాన్లే అదిరిపోయారు. ముఖ్యంగా కీలకమైన ఇన్ఫార్మర్లు ఆయనకు బాగా సహకరించారు.
కానీ ఛోటా రాజన్ తన కీలక ఇన్ఫార్మర్ ను చంపేయడంతో.. ప్రదీప్ శర్మ రగిలిపోయారు. అప్పట్నుంచీ ఛోటా రాజన్ కంటి మీద కునుకు లేకుండా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేశారు. దావూద్ ఇబ్రహీం కూడా ఫారిన్లో తలదాచుకోవడానికి ఈయన కూడా ఓ కారణమనే వాదన ఉంది. అలాంటి అధికారికి గ్యాంగ్ స్టర్లతో సంబంధాలున్నాయనే కారణంతో సర్వీస్ నుంచి పక్కనపెట్టారు.
ప్రదీప్ శర్మపై జరిగిన విచారణలో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. దీంతో ప్రదీప్ శర్మకు మళ్లీ స్వాగతం పలుకుతోంది ముంబై క్రైం బ్రాంచ్. ప్రదీప్ శర్మ వస్తున్నాడని తెలియగానే ముంబైలో డాన్ల అనుచరులు, ఉగ్రవాదులు ఉలిక్కిపడుతున్నారు. అప్పట్లోనే ఫుల్ జోష్ లో ఉన్న ప్రదీప్ శర్మ.. ఇప్పుడు తనపై గ్యాంగ్ స్టర్ల కారణంగానే మచ్చ పడిందని రగిలిపోతారేమోనని భయపడుతున్నారు.
మరిన్ని వార్తలు: