మహారాష్ట్ర పోలీసు విభాగంలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ప్రదీప్ శర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. థానే క్రైం బ్రాంచ్లో పని చేస్తున్న ప్రదీప్ శర్మ.. సుమారు 100కు పైగా ఎన్కౌంటర్లు ఆయన పేర ఉన్నాయి. ప్రదీప్ శర్మ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. త్వరలో మహారాష్ట్రలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో శివసేన నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2008లో గ్యాంగ్స్టర్ లఖాన్ భాయ్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ప్రదీప్ శర్మతో పాటు 13 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఈ కేసులో ఆయన నిర్దోషిగా తేలడంతో తిరిగి 2013లో విధుల్లోకి వచ్చారు. దాదాపు 300ల మందికిపైగా గ్యాంగ్స్టర్లను ప్రదీప్ ఎన్కౌంటర్ చేశారు.