ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండే ఆహారం పై మీరు శ్రద్ధ పెట్టకపోతే ఇప్పుడైనా శ్రద్ధ పెట్టడం మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కూడా మీరు గమనిస్తూ ఉండాలి. అయితే ఈ రోజు మనకు తెలియని ఎన్నో ముఖ్యమైన విషయాలను న్యూట్రిషనిస్ట్ షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూసేయండి.
ఎప్పుడూ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది నిజంగా చాలా ముఖ్యం. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోండి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు:
యోగర్ట్‌లో ప్రోటీన్, క్యాల్షియం మరియు మంచి ఫ్యాట్స్ ఉంటాయి. గట్‌ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే బ్యాక్టీరియా జీర్ణ సమస్యలు రాకుండా చూసుకుని జీర్ణ ప్రక్రియను ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా దీని వలన మనకి ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది. మంచి ఎనర్జీని కూడా యోగర్ట్‌తో మనం పొందొచ్చు.
స్టీల్ కట్ ఓట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని కనుక మీరు తీసుకుంటే ఎక్కువ సేపు కడుపుని నిండుగా ఉంచుతుంది. ఎనర్జీని కూడా ఇది ఇస్తుంది. కనుక రెగ్యులర్‌గా వీటిని కూడా మీరు మీ డైట్‌లో తీసుకోవడం మంచిది. దాంతో ఈ ప్రయోజనాలు మీరు పొందవచ్చు.
అరటి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అరటి పండులో నేచురల్ షుగర్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. అదే విధంగా అరటి పండులో పొటాషియం మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం కూడా దీనిలో ఎక్కువగా ఉంటుంది. దీనిని హ్యాపీ ఫుడ్ అని కూడా అంటారు. అరటి పండును తీసుకోవడం వల్ల కూడా మీకు మంచి మేలు కలుగుతుంది. కాబట్టి డైట్‌లో తప్పకుండా దీనిని తీసుకోవడం మంచిది.
నట్స్ మరియు గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రెగ్యులర్ గా నట్స్, గింజలని మీరు మీ డైట్ లో తీసుకోవడం వల్ల ఎనర్జీ మీకు లభిస్తుంది. కొన్ని వేరు శెనగ పలుకులు, కొన్ని బాదం, గుమ్మడి గింజలు, ఫ్లేక్స్ సీడ్స్‌ని కొన్ని గంటల పాటు గ్యాప్ ఇచ్చి తీసుకుంటూ ఉండండి.
దీనితో మంచి ఎనర్జీ లెవెల్స్ మీకు ఉంటాయి. నట్స్, గింజలు తీసుకోవడం వల్ల మీకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఇతర మైక్రో న్యూట్రియెంట్స్ కూడా అందుతాయి. కనుక రెగ్యులర్‌గా వీటిని కూడ తీసుకుని ఈ బెనిఫిట్స్ ని పొందండి.
క్వినోవాలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మరియు కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ కూడా ఉంటాయి. విటమిన్స్ మరియు మినిరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అనొచ్చు. అలానే దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది కూడా శక్తిని ఇస్తుంది. కాబట్టి డైట్‌లో వీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మంచిది.
జర్మినేషన్ ప్రాసెస్‌లో మొలకలు చేసి తీసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో షుగర్ అనేది అస్సలు ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు మీకు కడుపు నిండుగా ఉంటుంది. అలానే వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. అదే విధంగా ఐరన్ కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు వీటి వలన కలుగుతుంది.
ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అని న్యూట్రీషనిస్ట్ చెబుతున్నారు. చూశారు కదా ఈ ఆహార పదార్థాల వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చో.. మరి రెగ్యులర్ గా వీటిని మీ డైట్‌లో తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. పైగా మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.