ప్రస్తుతానికి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఐసిసి చైర్మన్ పదవికి సరైన వ్యక్తని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతానికి బీసీసీఐ లో కొనసాగుతున్నటువంటి గంగూలీ అనుభవం ఐసిసికి ఎంతో అవసరమని, ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ కి ఉన్నటువంటి అతని అనుభవం, నాయకత్వ లక్షణాలు, ఐసీసీ చైర్మన్ పదవికి ఎంతో ఉపయోగపడుతుందని వాఖ్యానించారు. అంతటి సమర్ధవంతమైన నాయకుడు గంగూలీ కి ఐసిసి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తాడని డేవిడ్ గోవర్ జోస్యం చెప్పాడు.
ఇకపోతే క్రికెట్ లో టీమిండియా సారధిగా ఎన్నో చారిత్రక విజయాలు సృష్టించిన గంగూలీ, ఆ తరువాత బిసిసిఐ అధ్యక్షుడిగా కూడా తనదైన ముద్ర వేశాడని స్పష్టం చేశారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటు గంగూలీ, మన క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్నో, సహాయ సహకారాలు అవసరమని డేవిడ్ వార్నర్ వాఖ్యానించారు. కాగా గంగూలీ సారథ్యంలోనే క్రికెట్ గ్లోబల్ క్రీడగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని గోవర్ వాఖ్యానించారు.