కాంగ్రెస్‌లో అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ .. ఎందుకీ నిశ్శబ్దం?

Everything is pin drop silence in Congress.. Why silence?
Congress

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తెలంగాణ కాంగ్రెస్‌కు బూస్ట్‌ ఇచ్చింది. దీంతో ఇక తగ్గేదేలే అన్నట్లు నేతలు దూకుడు పెంచారు. ఏఐసీసీ కూడా ఇక నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణనే అని ప్రకటించింది. ఈమేరకు ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా దూకుడు ప్రదర్శించారు. ఇక ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ కూడా విజయవంతమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఊపు తెచ్చింది. ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో అంతా సైలెంట్ అయ్యారు కానీ ఇంతవరకు బాగానే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అవినీతిని ఎండగట్టారు. అభివృద్ధిని ఎలా అడ్డుకున్నారు. తెలంగాణను ఎలా నిర్లక్ష్యం చేశారు అని పూస గుచ్చినట్లు వివరించారు. కానీ, కాంగ్రెస్‌ వైపు నుంచి కనీసం ఖండన కూడా రాలేదు. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ, సీఎల్పీనేత భట్టి కానీ వీటిని ఖండించలేదు. సీఎం ప్రసంగానికి ముందురోజు కేటీఆర్‌ వర్సెస్‌ శ్రీధర్‌బాబు అన్నట్లుగా సభ జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో సభ వేడెక్కింది. కానీ, పార్టీని తిట్టినప్పుడు మాత్రం అంతా సైలెంట్‌ అయిపోయారు.