బాబు ట్రాప్ లో జగన్,పవన్ .

Ex Cm Says Chandrababu Trapped Jagan And Pawan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 ఎన్నికల బరిలో ఒకరితో ఒకరు తలపడతారు అనుకున్న వైసీపీ అధినేత జగన్, జనసేనాధిపతి పవన్ ముందుగానే పంచాయితీ పెట్టారు. వీళ్ళ మధ్య మాటల యుద్ధం ఫలితం ఏమిటో ఎన్నికలు అయ్యాక గానీ తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఈ మాటల యుద్ధంతో ఒకరి ఉచ్చులో ఇంకొకరు చిక్కుకుపోయారు. అదెలాగంటే… 2014 ఎన్నికల ఫలితాలు చూసాక వైసీపీ అధినేత జగన్ కి ఓ విషయం బాగా అర్ధం అయ్యింది. కాపుల మద్దతు లేకుండా వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడం కష్టం అని. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావంతో తాను ఓడిపోయినట్టు గుర్తించిన జగన్ అప్పటినుంచి పవన్ కి దగ్గర కావడం లేదా కనీసం ఆయన దగ్గర నుంచి కాపులను దూరం చేయడం అనే లక్ష్యాలు పెట్టుకున్నారు.

ysrcp-jagan

అతి సున్నితమైన ఈ అంశాన్ని డీల్ చేయడానికి ముద్రగడ ని వాడి కాపు రిజర్వేషన్ డిమాండ్ తో విద్వేషం రగులుతుందని వైసీపీ వ్యూహకర్తలు భావించి వుంటారు. అయితే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించడంతో ముద్రగడ పప్పులు ఉడకలేదు. ఆయన వెనుక ఉన్న వైసీపీ పప్పులు అంతకన్నా ఉడకలేదు. ఇక ప్రత్యేక హోదా అంశం అడ్డు పెట్టుకుని పవన్ న ట్రాప్ చేయడానికి విజయసాయి ని ప్రయోగించినా ఫలితం లేకపోయింది. సహజంగా తాను అనుకున్నది జరగకపోతే సహనం కోల్పోయే జగన్ , ఇక్కడ పవన్ విషయంలో ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పవన్ ని విమర్శిస్తే కాపులు దూరం అవుతారన్న విషయాన్ని బుర్రకి ఎక్కించుకుని మరీ ఆచితూచి మాట్లాడారు. కానీ పవన్ ఈ రెండు రోజులుగా చేస్తున్న వై.ఎస్ పాలనలో అవినీతి, జగన్ అర్హతల మీద నేరుగా దాడి చేసేసరికి సీన్ మారిపోయింది.

pawan-janasena

జగన్ కూడా సూటిగా పవన్ ని ఎటాక్ చేశారు. ఆ విధంగా జగన్ ని ముగ్గులోకి దింపి కాపులను వైసీపీ వైపు వెళ్లకుండా చేయాలన్న పవన్ ఉచ్చులో జగన్ చిక్కుకున్నారు. ఇక ఇంకో విధంగా చూస్తే పవన్ కూడా జగన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అదెలాగంటే… 2019 ఎన్నికల బరిలోకి దిగబోతున్న జనసేన మీద ఏ కుల ముద్ర పడకూడని పవన్ తపించారు. అంతే కాకుండా జనసేన ఇటు వైసీపీ , అటు టీడీపీ రెంటికీ సమదూరం పాటిస్తుందని చెప్పేందుకు పవన్ ప్రయత్నించారు. ఈ విషయంలో పవన్ వ్యవహారశైలి మీద బాబు కి అనుకూలం అన్న విమర్శలు వచ్చినప్పటికీ వైసీపీ ఆరోపణల మీద కొంత సందేహం ఉండేది. కానీ తాజాగా విశాఖ, పోలవరం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో పవన్ తాము చెప్పినట్టే బాబు అనుకూల వైఖరి తీసుకున్నాడని చెప్పేందుకు వైసీపీ కి గట్టి అవకాశం దొరికింది. ఇంతకుముందులా పవన్ కామెంట్స్ పై సైలెంట్ గా ఉండకుండా ఇంకాస్త రెచ్చగొట్టి జగన్ తాను అనుకున్నది సాధించారు. ఆ విధంగా చూస్తే జగన్ ట్రాప్ లో పవన్ పడ్డట్టే. ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరగా పరిశీలించిన ఓ మాజీ సీఎం తన సన్నిహితులతో ఈ ఇద్దరూ ఒకరి ట్రాప్ లో ఇంకొకరు పడడం కాదు ఇద్దరూ కలిసి బాబు ట్రాప్ లో పడ్డారు అని కామెంట్ చేశారట.

chandra-babu-cm