గంటా – మాజీ డీజీపీ చర్చలు…అందుకేనా…?

Ex Dgp Meets Ganta Srinivas Rao

మాజీ డిజిపి సాంబశివరావు ఏదో రాజకీయ వ్యూహంతోనే ముందుకెళుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, పార్టీల అధినేతలతో ఆయన సమావేశాలు జరుపుతున్న తీరు అనుమానాలను రేకెత్తిస్తోంది. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాజీ డిజిపి భేటీతో అనుమానాలు మరింత పెరిగాయి. భేటీ మామూలే అని చెబుతున్నా ఎవరూ నమ్మటం లేదు. వ్యక్తిగతంగా గంటాతో సాంబశివరావుకు మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే జగన్ తో భేటీ అయిన ఆయన ఇప్పుడు గంటాను కలవడం చర్చనీయాంశం అయింది. అయితే వీరి మధ్య జరిగిన చర్చ వివరాలు మాత్రం బయటకు రాలేదు.

dgp-jagan
ఈమధ్య విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ ను సాంబశివరావు కలవటం సంచలనమైంది. రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంఎల్ఏ లేదా ఎంపిగా వైసిపి తరపున పోటీ చేయబోతున్నారంటూ ఒకటే ప్రచారం జరిగింది. దాంతో టిడిపి నేతలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. వెంటనే చంద్రబాబుతో భేటీకి ఏర్పాటు చేశారు. జగన్ తో ఏం మాట్లాడారో తెలీదు, చంద్రబాబుతో ఏం మాట్లాడింది తెలియలేదు. తాజాగా గంటాతో భేటీ అవటం సర్వత్రా ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఎందుకంటే, గంటా టిడిపిని వదిలేసి జనసేనలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎలాగూ జనసేన కాపుల కోసమే పెట్టిన పార్టీగా ప్రచారంలో ఉంది. జనసేన అధినేత, గంటా, సాంబశివరావు అందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావటంతోనే గంటా – మాజీ డిజిపి భేటీ పై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

jagan-dgp-beti