మూడ్రోజుల క్రితం కలకం రేపిన జగన్ – మాజీ డీజీపీ కలయిక రాజకీయ వర్గాల్లో ఇంకా నానుతూనే ఉంది. అంతలా కలకలం రేపిన వారి కలయిక నాలుగు రోజులు గడిచినా హాట్ టాపిక్‌గానే ఉంది. ఒకప్పుడు సీఎం చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ డీజీపీ జగన్‌ను స్వయంగా కలవడం, మునుపెన్నడూ లేని విధంగా జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ ఆయనతో మాట్లాడి రావడం చూసి నండూరి వైసీపీలో చేరతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడం మరింత టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది.
అయితే తాను పార్టీ చేరేది లేదని ఆయన ప్రకటించినా ఈ విషయం బాబు వరకు వెళ్ళింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాజీ డీజీపీ సాంబశివరావు ఈరోజు ఉదయం కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సాంబశివరావు సీఎం చంద్రబాబును కలిశారు. వీరిద్దరి మధ్య 20నిమిషాల పాటు చర్చలు జరిగాయి. వీరిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాలేదు. మొన్న జగన్‌ను కలవడం, ఇప్పుడు చంద్రబాబును సాంబశివరావు కలవడం పట్ల పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే గంగవరం పోర్టు సీయీవోగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతను ఎందుకు కలవ వలసి వచ్చింది అనే విషయం మీద వివరణ ఇచ్చేందుకు అని విశ్లేషకులు భావిస్తున్నారు.