షాక్…. జనసేనలోకి వైసీపీ నేత

Ex Mlc Durgesh Ready To Come In Janasena

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు జనసేన వర్గాల సమాచారం. పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితం, పెళ్ళిళ్ళ మీద పై జగన్ నోరు జారడం, కాపు రిజర్వేషన్ల విషయంలో రెండ్రోజులకో యూటర్న్ తీసుకోవడం వల్లే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు ఆఉఅన సన్నిహిత వర్గాల చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు దుర్గేశ్ కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉండడం జిల్లాలోని వైసీపీ శ్రేణులను వేధిస్తోంది.

kandhula-durgesh

రాజమహేంద్రవరం రూరల్ నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్న దుర్గేశ్ ప్రస్తుతం వైసీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, తాను టికెట్ ఆశిస్తుండగా జగన్ మాత్రం ఆకుల వీర్రాజుకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతోనే దుర్గేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీలో మరో వర్గం వాదిస్తోంది. నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజే జనసేనలో చేరిక మీద కూడా ఒక ప్రకటన చేసే అవకాసం కనపడుతోంది.

kandhula