నిన్న రాత్రి ఏపీ సచివాలయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సచివాలయంలో ప్రత్యక్షమైన ఆయనను చూసి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు సహా వివిధ పనుల మీద సచివాలయం వద్ద నున్నవారు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేకపోవడం వల్ల తెదేపా తీర్ధం పుచ్చుకోడానికి సిద్డంయ్యరని కొన్ని చానెళ్ళు స్క్రోలింగ్ లు సైతం సిద్దం చేసుకున్నాయి, కానీ అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చినందునే తాను వచ్చానని ఉండవల్లి వారికి చెప్పారు. గత కొంతకాలంగా ఏపీ ప్రత్యేక హోదాపై ఆయన అనేక రూపాల్లో పోరాటం చేస్తూ హోదా విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. విభజన హామీలపై ఆయన టీవీ డిబెట్లలో పాల్గొంటూ తన వాదనను వినిపిస్తూ వస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులు, ఖర్చులకి సంబంధించి వాస్తవాలను వెలికితీసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉండవల్లి కీలకపాత్ర వహించారు.
గత పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టినా చర్చకు రానీయలేదని భావించిన బాబు ఇప్పుడు మరోమారు అవిస్వాసం పెట్టేందుకు మరలా సిద్దమయ్యారు. ఆ పెట్టె అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు ఇప్పటికే పలు పార్టీల ఎంపీలను కలుస్తున్నారు. టీడీపీ కేంద్రంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబుతో ఉండవల్లి భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే సీఎంతో రెండు గంటలు భేటీ అయిన ఉండవల్లి తర్వాత మీడియాతో మాట్లాడారు తాను ఏ పార్టీలో లేనని ఏ పార్టీలో చేరనని కానీ రాజీనామాలకు వ్యతిరేకమయినా గతంలో రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను సీఎంకు అందజేశానన్నారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని…ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశానన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేశానన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటి నుంచి విభజన రాజ్యాంగ విరుద్ధమని పోరాడుతున్నానని గుర్తు చేశారు.
విభజన చట్టం రాజ్యసభలో పాస్ కాలేదని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అదే అంశం మీద ఒక పుస్తకం రాశారు. అలాగే ఉండవల్లి బాబుకు కొన్ని సూచనలు చేస్తువచ్చారు దాని ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటనను బేస్ చేసుకుని పార్లమెంట్ లో విభజన అంశం చర్చించాలని ఉండవల్లి సూచించారు. అదే సమయంలో ఉండవల్లి పుస్తక కాపీని ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు కూడా తీసుకున్నారు. ఆ పుస్తం ప్రకారం విభజన చట్టం రాజ్యసభలో పాస్ కాలేదని రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన లెక్కలు ఆయన సేకరించారు. విభజన చట్టం పాస్ అయినప్పుడు రాజ్యసభలో 353 మంది ఉన్నారు. వారిలో 173 మంది సంతకాలు పెట్టలేదని ఉండవల్లి అంటున్నారు. ఆ బిల్లు ఆమోదించిన సమయంలో అన్నాడీఎంకే, జేడీ యూ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశాయని బిల్లు పాస్ కావాల్సిన దానికి కావాల్సిన మెజార్టీ లేదని చెబుతున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే ఉండవల్లి చట్ట ప్రకారంగా ముందుకు వెళుతున్నారు. దీంతో ఇప్పుడు పార్లమెంట్ లో మోడీ మీద పోరాడాల్సి రావడంతో బాబు యే చిన్న మార్గాన్ని వదులుకోవడంలేదు. ఈ నేపధ్యంలోనే ఉండవల్లిని కలిసారని తెలుస్తోంది.