బీఆర్‌ఎస్‌ ఫస్ట్‌ లిస్ట్‌పై ఉత్కంఠ.. సిట్టింగుల్లో టెన్షన్‌!

Excitement on the first list of BRS
Excitement on the first list of BRS

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీఆర్‌ఎస్‌ లిస్ట్‌ రిలీజ్‌కు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కసరత్తు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మొదలు పెట్టారు. దాదాపుగా లిస్ట్‌ ఫైనల్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఫస్ట్‌ లిస్ట్‌ను రెండు రోజుల్లో రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. ఇందులో 80 పేర్లు ఉన్నట్లు నిన్నటి వరకు ప్రచారం జరగింది. తాజాగా తొలి జాబితా 51 మందితోనే రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు చెందిన అభ్యర్థులకు ఈ లిస్ట్‌ లో ప్రాధాన్యం కల్పించినట్టు తెలుస్తుంది.

సర్వే ఆధారంగానే..
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా సర్వే చేయించారు. దాని ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఇక యజ్ఞాలు, యాగాలు, ముహూర్తాలు, వాస్తును బలంగా నమ్మే కేసీఆర్‌ శ్రావణమాసం తొలి సోమవారం రోజున అంటే ఈనెల 21న బీఆర్‌ఎస్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయిన గులాబీ బాస్‌ ఈసారి దానినే నమ్ముకున్నారు.

జాబితాలో 51 మంది పేర్లు..
మొత్తం 51 మంది అభ్యర్థులతో కూడిన తొలి లిస్ట్‌ ను వెల్లడించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు లేని అభ్యర్థులకు కేటాయింపులు చేసినట్టు సమాచారం. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక అభ్యర్థుల ప్రకటన అనేది ఉంటుంది. కానీ షెడ్యూల్‌ విడుదల కాకముందే సీఎం కేసీఆర్‌ తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తమకు ఈసారి సీటు దక్కుతుందా లేదా అని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు టెన్షన్‌ పడుతున్నారు.

వైరల్‌ అవుతున్న 80 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా..

ఉమ్మడి అదిలాబాద్‌

సిర్పూర్‌ – కోనేరు కొనప్ప

చెన్నూరు – బాల్క సుమన్‌

ఆసిఫాబాద్‌ – అత్రం సక్కు

అదిలాబాద్‌ – జోగు రామన్న

బోథ్‌ – రాథోడ్‌ బాపురావు

నిర్మల్‌ – ఇంద్రకరణ్‌రెడ్డి

ముదోల్‌ – విఠల్‌రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌

ఆర్మూర్‌ – జీవన్‌రెడ్డి

బోధన్‌ – షకీల్‌ అహ్మద్‌

జుక్కల్‌ – హనుమంత్‌ షిండే

బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఎల్లారెడ్డి – జాజుల సురేందర్‌

నిజామాబాద్‌ అర్బన్‌ – గణేశ్‌బిగాల

నిజామాబాద్‌ రూరల్‌ – బాజిరెడ్డి గోవర్ధన్‌

బాల్కొండ – వేముల ప్రశాంత్‌రెడ్డి

ఉమ్మడి కరీంనగర్‌

కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు/సంజీవ్‌

జగిత్యాల – సంజయ్‌

మంథని – పుట్ట మధు

కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌

సిరిసిల్ల – కేటీఆర్‌

మానకొండూరు – రసమయి బాలకిషన్‌

హుస్నాబాద్‌ – వొడితెల సతీశ్‌కుమార్‌

రామగుండం – కొరుకంటి చందర్‌

ఉమ్మడి మెదక్‌

సిద్దిపేట – తన్నీరు హరీశ్‌రావు

నారాయణఖేడ్‌ – ఎం.భూపాల్‌రెడ్డి

నర్సాపూర్‌ – చిలుముల మదన్‌రెడ్డి

పఠాన్‌ చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి

దుబ్బాక – కొత్త ప్రభాకర్‌రెడ్డి

గజ్వేల్‌ – కేసీఆర్‌

ఉమ్మడి రంగారెడ్డి

మేడ్చల్‌ – చామకూర మల్లారెడ్డి

మల్కాజ్‌ గిరి – మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్‌ – కేపీ. వివేకానంద

కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఎల్బీ నగర్‌ – దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి

రాజేంద్రనగర్‌ – ప్రకాశ్‌రెడ్డి

శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ

వికారాబాద్‌ – మెతుకు ఆనంద్‌

తాండూర్‌ – పైలట్‌ రోహిత్‌రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్‌

ముషీరాబాద్‌ – ముఠా గోపాల్‌

ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌

జూబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్‌

సనత్‌ నగర్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సికింద్రాబాద్‌ – టి. పద్మారావు

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌

కొడంగల్‌ – పట్నం నరేందర్‌

నారాయణ్‌ పేట్‌ – ఎస్‌. రాజేందర్‌రెడ్డి

మహబూబ్‌ నగర్‌ – వి.శ్రీనివాస్‌గౌడ్‌

జడ్చర్ల – సి.లక్ష్మారెడ్డి

షాద్‌ నగర్‌ – అంజయ్యయాదవ్‌

దేవరకద్ర – అల వెంకటేశ్వరరెడ్డి

మక్తల్‌ – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

గద్వాల్‌ – బండ్ల కృష్ణమోహన్‌

నాగర్‌ కర్నూల్‌ – మర్రి జనార్దన్‌రెడ్డి

కొల్లాపూర్‌ – బీరం హర్షవర్ధన్‌

ఉమ్మడి నల్లగొండ

దేవరకొండ – రమావత్‌ రవీంద్రకుమార్‌

మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్‌రావు

హుజూర్‌నగర్‌– శానంపుడి సైదిరెడ్డి

సూర్యాపేట – జి.జగదీశ్‌రెడ్డి

నల్గొండ – కంచర్ల భూపాల్‌రెడ్డి

భువనగిరి – పైలా శేఖర్‌రెడ్డి

నకిరేకల్‌ – చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి – గాదరి కిశోర్‌

ఆలేరు – గొంగడి సునీత

మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

ఉమ్మడి ఖమ్మం

పినపాక – రేగ కాంతారావు

ఇల్లందు – బానోత్‌ హరిప్రియ

ఖమ్మం – పువ్వాడ అజయ్‌కుమార్‌

పాలేరు – కందాళ ఉపేందర్‌రెడ్డి

సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య

అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వరరావు

ఉమ్మడి వరంగల్‌

పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌రావు

నర్సంపేట – పెద్ది సుదర్శన్‌రెడ్డి

పరకాల – చల్లా ధర్మారెడ్డి

వరంగల్‌ పశ్చిమ – దాస్యం వినయ్‌భాస్కర్‌

వరంగల్‌ తూర్పు – నన్నపునేని నరేందర్‌

స్టేషన్‌ ఘన్‌పూర్‌ – కడియం శ్రీహరి

మహబూబాబాద్‌ – బానోత్‌ శంకర్‌నాయక్‌

వర్ధన్నపేట – ఆరూరి రమేష్‌

జనగాం – పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి