2014లోనూ అంతే…కానీ టీడీపీ…ఈసారి ఎవరంటే ?

ఏకంగా మీడియా సంస్థలే కొన్ని రాజకీయ పార్టీలకు బహిరంగ వత్తాసు పలుకుతున్న నేటి సమాజంలో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 2014లో వివిధ మీడియా సంస్థలు విడుదల చేసిన అంచనాలను చూస్తే ఈ అనుమానం కలగకమానదు. 2014లో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కేవలం లగడపాటి, మహాన్యూస్ అంచనాలే దాదాపు నిజమయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ అప్పట్లో నెలకొంది. ఈ నేపథ్యంలో 2014 ఎగ్జిట్ పోల్స్‌ను అంతా ఆసక్తి కనబరిచారు. అయితే, వివిధ మీడియా సంస్థలు వివిధ రకాలైన లెక్కలు చెప్పాయి. ఇక ఈ సారి మాత్రం ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తాయన్న విషయమై ‘న్యూస్ ఎక్స్’, ‘టైమ్స్ నౌ’ తమ సర్వేలను వెల్లడించారు. ఈ రెండు సర్వేలు వైసీపీకి అత్యధిక స్థానాలు లభిస్తాయని తెలిపాయి. ‘టుడేస్ చాణక్య’ సర్వే సంస్థ మాత్రం టీడీపీకి ఎక్కువ స్థానాలు లభిస్తాయని పేర్కొంది. అలా చూస్తే ఈసారి కూడా టీడీపీకి ఫేవర్ గా అర్జీ ఫ్లాష్ టీం, అలాగే టుడేస్ చాణక్య సంస్థలు మాత్రమే టీడీపీ గెలుస్తుందని చెప్పాయి. చూడాలి మరి ఈసారి ఎవరి అంచనాలు ఏమవుతాయో ?