అంచ‌నాలు పెంచిన ‘ఎవ‌రు’ టీజ‌ర్

expectations increased for evaru movie teaser

అడివిశేష్‌, రెజీనా కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘ఎవరు’. ఆగస్టు 15న విడుద‌ల కానున్న చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. మొన్నామ‌ధ్య ఫ‌స్ట్ లుక్‌తో ఆస‌క్తి పెంచిన టీం తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేసి మ‌రింత అంచ‌నాలు పెంచింది. టీజ‌ర్‌లో ‘నా విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు’ అనే రెజీనా డైలాగ్ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ చిత్రం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠను పెంచుతుంది. ఓ పోలీస్‌ ఎవరి కోసం అన్వేషణ సాగిస్తున్నాడన్నది ఆకట్టుకుంటుంది. ఇందులో అడివి శేషు ‘విక్రమ్‌’ అనే తమిళ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. సినిమాకు వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మిస్తున్నారు. నవీన్‌చంద్ర కీలక పాత్రలో కనిపించ‌నున్నారు . తాజాగా విడుద‌లైన టీజ‌ర్ కొద్ది గంట‌ల‌లోనే మిలియ‌న్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది.