కొన్ని సంద‌ర్భాల వ‌ల‌న మ‌హేష్ సినిమాలో నేను లేను: జ‌గ‌ప‌తి

jagapathi babu gives clarity on rumors

మ‌హ‌ర్షి చిత్రం త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. క‌శ్మీర్‌లో రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ని పూర్తి చేసుకుంది ఈ చిత్రం . భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబుని ప్ర‌ధాన పాత్ర‌కి ఎంపిక చేశారు. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై జ‌గ‌ప‌తి బాబుతో పాటు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి స్పందించారు.

సినిమా ఇండ‌స్ట్రీ అనేది నా ఫ్యామిలీ లాంటిది.. నా ఫ్యామిలీ కోసం మాట్లాడటం ఇష్టం లేదు. అయితే ఒక క్లారిఫికేషన్ అయితే తప్పలేదు. గత 33 ఏళ్లుగా నేను ఇలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఇదే తొలిసారి. ఇంతకీ విషయం ఏంటంటే.. అనిల్ రావిపూడి, మహేష్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నుండి నేను తప్పుకున్నట్టు రకరకాల పుకార్లు వస్తున్నాయి. అవి నిజం కాదు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నా క్యారెక్టర్ చాలా ఇష్టం. నా క్యారెక్టర్ చేయడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నా. ఆ సినిమాకోసం నేను కొన్ని సినిమాలు వదులు కోవడం నిజమే కాని.. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పవు. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి కొన్ని సందర్భాల వల్ల ఆ సినిమాలో నేను లేను. మొత్తానికి ఆ సినిమా నేను మిస్ అయ్యా. ఆల్ ది బెస్ట్ యూనిట్’ అని వీడియోలో తెలిపారు జ‌గ‌ప‌తి బాబు. ‘అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ సార్.. మీపై ప్రేమ‌, గౌరవం ఎప్ప‌టికి ఉంటుంది.
’ అని ట్వీట్ చేశారు మ‌హేష్ బాబు.

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ.. జ‌గ‌ప‌తి బాబు గారికి చిత్రంలో క్యారెక్ట‌ర్ చాలా న‌చ్చింది. ఆయ‌న ప్రాజెక్ట్ నుండి వెళ్ళ‌లేదు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆయ‌న సినిమాలో భాగం కాలేక‌పోయారు. ఆయ‌న‌తో త్వ‌ర‌లో మ‌రిన్ని సినిమాలు చేస్తాం అని అనీల్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు.చాలా ఏళ్ళ త‌ర్వాత విజ‌యశాంతి ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.