భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం గట్టిగా ఉంది. రోజురోజుకీ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే పంజాబ్ రాష్ట్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లాక్ డౌన్ ను మరొక రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ అన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు.అయితే పంజాబ్ లో మే 3 వరకు లాక్ డౌన్ ఉండగా, ఆ తేదీ నుండి మరో రెండు వారాలు ఈ లాక్ డౌన్ పొడిగింపు ఉండనుంది.
అయితే ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా దాదాపు వెయ్యి మందికి పైగా మరణించారు. అందుకే కర్ఫ్యూ కారణంగా కేవలం నాలుగు గంటలకే సడలింపు ఉంటుంది అని వ్యాఖ్యానించారు.ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ప్రజలకు కావల్సిన నిత్యావసరాల షాపులు, దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే ఈ సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని, సనిటైజార్,మాస్క్ లని ఖచ్చితంగా ఉపయోగించాలి సూచించారు.