F2 సినిమా రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

F2 Movie Review Rating

నటీ నటులు : వెంకటేష్ , తమన్నా , వరుణ్ తేజ్, మెహ్రీన్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు
రచన -దర్శకత్వం : అనిల్ రావిపూడి

f2-movie

సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులకు హాస్యపు విందు కడుపునిండా పెట్టేందుకు ‘F2’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరితో పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడీ కట్టగా వరుణ్‌కి జోడీగా మెహ్రీన్ నటించారు. టీజర్, ట్రైలర్‌లతో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పర్ఫెక్ట్ మూవీ ఇదే అని ఫుల్ ఫన్ అండ్ ఫస్ట్రేషన్‌తో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టారు. దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అంతటి అంచనాలు సినిమా అందుకుందో లేదో చూద్దాం.

f2-venkatesh-movie
కధేంటంటే :
క‌థేంటంటే: హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. అయితే ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌ని చేసే వెంకీ (వెంక‌టేష్‌) హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. దీంతో అప్పటివ‌ర‌కూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. వెంకీ భార్య‌, అత్త అతని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు. మరోపక్క పేరలల్ గా వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) హ‌నీని ఇష్ట‌ప‌డ‌తాడు. అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు అర్థ‌మైన వెంకీ హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌ యాద‌వ్‌ని హెచ్చ‌రిస్తాడు. అయినా ప్రేమ మ‌త్తులో పీకల్లోతు దిగిన వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్ట‌వు. చివ‌ర‌కు హ‌నీని పెళ్లి చేసుకుంటాడు. అప్ప‌టి నుంచి అక్కా చెల్లెళ్ల దెబ్బకి తోడ‌ళ్లులు బెంబేలు ఎత్తుతారు. ఆ అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలిసి రాలవంటే మీరిద్ద‌రూ ఎక్క‌డికైనా వెళ్లిపోండ‌ని ప‌క్కింటి వ్య‌క్తి ఈ తోడ‌ల్లుళ్లకు స‌ల‌హా ఇస్తాడు. దీంతో ఇద్ద‌రూ ఇంట్లో చెప్పకుండా యూర‌ప్ వెళ్ళిపోతారు. మరి వీళ్ళు తమ భార్యలను మార్చారా ? లేదా ? యూరప్ వెళ్ళాక వచ్చే ట్విస్ట్ లు ఏమిటి అనేది తెలియాలి అంటే సినిమా చూడలసిందే.

venkatesh-f2-movie
విశ్లేషణ :
ముందు నుండీ చెబుతున్నట్టు ఈ సినిమా భార్యా బాదితులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. ఇద్దరు భార్యా బాదితులు ఒకే ఇంట్లో ఉంటె వారి ఆమధ్య ఎలాంటి వినోదం పుడుతుంది? అన్న‌దాని నుంచే పుట్టిందే ఈ సినిమా. ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే స్క్రీన్‌పై కనిపించడంతో ప్రతి ఒక్కరు సినిమాని ఓన్ చేసుకునతారు. తొలి స‌గం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు. ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. మెహ‌రీన్‌కు కూడా ఒక మేన‌రిజం ఇచ్చి, ఆ పాత్ర ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఫన్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ ఎంటర్‌టైన్ చేశారని.. సెకండాఫ్‌లో ఫన్‌కి ఫస్ట్రేషన్ జోడించి కడుపుచెక్కలయ్యేలా చేశారంటున్నారు. హారిక, హనీ సిస్టర్స్‌గా తమన్నా, మెహ్రీన్‌లు డిఫరెంట్ యాటిట్యూట్స్‌తో వెంకీ, వరుణ్‌ లకు చుక్కలు చూపించారు. ఫస్టాఫ్‌‌తో పోల్చుకుంటే సెకండాఫ్‌ కాస్త నెమ్మదించిందని అలాగే క్లైమాక్స్‌ రొటీన్ సినిమాల మాదిరిగానే ఉందంటున్నారు. క‌థగా విషయానికి వస్తే ఇదేమీ గొప్ప క‌థ కాదు. గ‌తంలో ‘సంద‌డే సంద‌డి’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి!’ వంటి చిత్రాల ఇన్స్పిరేషన్ కనపడుతుంది కానీ ఎవరినీ నొప్పించని సున్నిత‌మైన వినోదాన్ని ద‌ర్శకుడు చూపగలిగాడు.

venkatesh-varuntej-movie
నటీనటుల విషయానికి వస్తే వెంక‌టేష్ చాలా కాలం త‌ర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ చేశాడు. పాత చిత్రాల్లో వెంక‌టేష్ ఎలా న‌వ్వించారో ఈ సినిమాలో గుర్తు చేశాడు. సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా వెంకటశే సినిమాలో హైలైట్‌. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడాడు కానీ ఆ యాస వ‌రుణ్‌ కు తెచ్చి పెట్టుకున్నట్టు అనిపించింది. ఇక త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత అలరించింది. మెహ‌రీన్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌ ఇలా ప్ర‌తి పాత్ర న‌వ్వించ‌డానికి బాగా నప్పారు. ఇక టేక్నికాలిటీస్ విషయానికి వస్తే దర్శకుడిగానే లాల ర‌చ‌యిత‌గా కోద్దా అనిల్‌ రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. త‌న బ‌లం వినోద‌మే. దాన్ని సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ ప్ర‌తి సీన్‌లో పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అనవసరమైన ట్విస్టులు, హంగుల‌వైపు వెళ్ల‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. కెమెరా పనితనం కనిపించింది, ఎడిటింగ్ బాగుంది.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : నిజంగా సంక్రాంతి అల్లుళ్ళు ఫన్ తో ఫ్రస్టేషన్ పోగొడుతున్నారు.
తెలుగు బులెట్ రేటింగ్ : 3.25 / 5